

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ‘ముందస్తు డిపాజిట్’ (EMD) ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ₹10,000 చెల్లిస్తే ఇల్లు ఇప్పిస్తామని, డబ్బులు చెల్లించేందుకు ఈ రోజే చివరి తేదీ అంటూ ఒత్తిడి చేసే నకిలీ కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు. ఇలాంటి కాల్స్ లేదా సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి డబ్బులు పంపకుండా, అధికారిక మార్గాల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని ప్రజలకు సూచించారు.
అపరిచిత వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులను క్లిక్ చేయడం, APK ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయడం లేదా AnyDesk, TeamViewer వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం చేయవద్దని సజ్జనార్ హెచ్చరించారు. రీఫండ్ లేదా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పేరుతో వచ్చే కాల్స్‌కు ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, UPI పిన్, OTP వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, చెల్లింపు అభ్యర్థనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!