
జనరల్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రతీకా తొండ్వాల్కర్ సాగించిన ఉద్యోగ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. భర్త మరణంతో కుటుంబ బాధ్యతలు మీద పడిన సమయంలో, 20 ఏళ్ల వయసులో 1985లో ఆమె SBIలో క్లీనింగ్ సిబ్బందిగా ఉద్యోగంలో చేరారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగారు. ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగించి డిగ్రీ పూర్తి చేశారు.
అనంతరం బ్యాంకు నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ వరుసగా పదోన్నతులు పొందారు. తన కృషి, అంకితభావంతో 2022లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) స్థాయికి ఎదిగారు. క్లీనింగ్ సిబ్బందిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, బ్యాంకులో ఉన్నతాధికారిగా ఎదిగిన ఆమె ప్రయాణం కష్టపడే తత్వం, విద్య ప్రాధాన్యం, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!