

కరీంనగర్‌లో ఈ నెల 18న లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. జన సమీకరణ, పాదయాత్ర ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు.
మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పాదయాత్రకు ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించాలని బండి సంజయ్ పార్టీ నేతలకు సూచించారు. ‘SIR’ పేరుతో రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన ఆయన, వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!