

బాలీవుడ్ సినీ ప్రముఖులకు గ్యాంగ్‌స్టర్ల నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో పోలీసులు నటీనటులకు కీలక భద్రతా సూచనలు జారీ చేశారు. ఇప్పటికే నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగిన ఘటనతో పాటు, రణ్‌బీర్ కపూర్ నివాసం వద్ద అనుమానితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నటీనటులే లక్ష్యంగా గ్యాంగ్‌స్టర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అనుమానాల నేపథ్యంలో, ఎక్కువ మంది అభిమానులు గుమిగూడే కార్యక్రమాలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు అభిమానులు సెల్ఫీలు, ఫొటోల కోసం పెద్ద సంఖ్యలో చుట్టుముట్టే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాల్లో అభిమానులతో సెల్ఫీలు దిగడం, రద్దీ ప్రాంతాల్లో ఎక్కువసేపు గడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యే సమయంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, అభిమానులను కలిసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియా పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నటీనటుల కదలికలను గ్యాంగ్‌స్టర్లు గమనిస్తున్నారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నటీనటులు ఉపయోగించే వాహనాలు, వారి భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే బాలీవుడ్ ప్రముఖులను అప్రమత్తం చేస్తూ పోలీసులు ఈ సూచనలు జారీ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!