

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, ‘జవాన్’ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతున్నప్పటికీ.. సెట్స్ నుంచి కీలక సమాచారం బయటకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బన్నీ లుక్ ఎలా ఉంటుంది? షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఎలాంటి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు? వంటి విషయాలపై ఇప్పటివరకు పెద్దగా స్పష్టత లేదు.
ఈ గోప్యత వెనుక చిత్రబృందం ప్రత్యేక వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. ‘రాకా’ గురించి ఎస్‌కేఎన్‌ను ప్రశ్నించగా.. తనకు కూడా పూర్తి సమాచారం లేదని, షూటింగ్‌కు రోజూ దగ్గరగా ఉండే బన్నీ వాస్, శరత్‌లకే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం. సాధారణంగా అట్లీ సినిమాల విషయంలో హీరో లుక్స్, నటీనటుల ఎంపిక, పాత్రల వివరాలు ముందుగానే బయటకు వస్తుంటాయి. ‘జవాన్’ సమయంలోనూ షారుక్ ఖాన్ లుక్, నయనతార పాత్ర, విజయ్ సేతుపతి క్యారెక్టర్‌పై ముందుగానే చర్చ జరిగింది. కానీ ‘రాకా’ విషయంలో లీకులు దాదాపు లేకపోవడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!