

ప్రముఖ కథానాయిక శ్రద్ధా కపూర్ తన కొత్త చిత్రం కోసం శారీరకంగా ఎంతో కష్టపడినట్లు వెల్లడైంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఈతా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ తమాషా కళాకారిణి వితాబాయి నారాయణ్‌గావ్కర్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రణదీప్ హుడా, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రలు చేస్తున్నారు. కథలోని ద్వితీయ భాగంలో వయసు పైబడిన మహిళగా కనిపించేందుకు శ్రద్ధా ఏకంగా 12 కిలోల బరువు పెరిగినట్లు సమాచారం. పాత్ర సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో ఆమె ఈ మార్పుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం చిత్ర బృందం కూడా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించింది.
నృత్య దర్శకురాలు వైభవి మర్చంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, చిత్రీకరణను చివరి భాగం నుంచి ప్రారంభించారు. ముందుగా క్లైమాక్స్ పాటతో పాటు ద్వితీయ భాగంలోని సన్నివేశాలను తెరకెక్కించారు. బరువు పెరగడంతో శ్రద్ధాపై శారీరక ఒత్తిడి పెరిగిందని, కఠినమైన సాధన కూడా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే షూటింగ్ సమయంలో గాయపడటంతో ఆమె 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. కోలుకున్న తర్వాత మొదటి భాగం కోసం మళ్లీ బరువు తగ్గడం ప్రారంభించారు. ఆమె చేసిన ఈ కష్టం తెరపై ఎంతవరకు ఫలిస్తుందో డిసెంబర్ 4న సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!