

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తికావాల్సి ఉండగా, బాలయ్యకు చిన్నపాటి గాయం కావడంతో చిత్రీకరణకు కొంత విరామం వచ్చింది. దీంతో సినిమా విడుదల తేదీపై కూడా ఆసక్తి నెలకొంది.
తొలుత బాలయ్య 111వ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఆ తర్వాత విడుదలను డిసెంబర్ మొదటి వారానికి మార్చినట్లు సమాచారం. అయితే షూటింగ్‌లో అనుకోని గ్యాప్ రావడంతో ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ చివరి వారానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అదే నిజమైతే క్రిస్మస్ బరిలో బాలయ్య మాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇదే సమయంలో పలు క్రేజీ హాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగు ఆడియెన్స్‌లో ఆ చిత్రాలపై కూడా భారీ ఆసక్తి ఉండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
అయితే బాలయ్య 111 సినిమా విడుదల తేదీ మార్పుపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక క్లారిటీ వచ్చిన తర్వాతే సినిమా రిలీజ్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!