

బ్లాక్‌బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమా మార్చిలో, ఆ తర్వాత ఆగస్టులో విడుదల కావచ్చని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25, 2026న విడుదల చేసే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బడ్జెట్ అంచనాలను మించినప్పటికీ, సినిమా కంటెంట్ మరియు నాణ్యతపై నిర్మాతలు పూర్తి నమ్మకంతో ఉన్నారని సమాచారం. ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయాదు లోహర్, రాఘవ్ జుయల్, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!