
ఓటీటీ

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆమె నిజంగానే నటిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!