

సినిమా విజయం హీరోల మార్కెట్, పారితోషికంపై ప్రభావం చూపించడం సాధారణమే. తాజాగా శర్వానంద్ విషయంలోనూ ఇదే జరుగుతున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆయన రూ.10–12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ‘నారీ నారీ నడుము మురారి’ విజయంతో పాటు ‘బైకర్’ చిత్రానికి వచ్చిన విమర్శకుల ప్రశంసల నేపథ్యంలో రెమ్యునరేషన్‌ను పెంచే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’, శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రాల్లో శర్వానంద్ నటిస్తున్నారు. ‘భోగి’తో పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన మార్కెట్‌పై కూడా అంచనాలు పెరిగాయి.
మరోవైపు అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ పీరియాడిక్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన రూ.20 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే శర్వానంద్ పారితోషికంపై వస్తున్న ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!