

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి విద్యా బాలన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇందులో కథానాయికగా నటించడం లేదని, ప్రత్యేక అతిథి పాత్రలో మాత్రమే ప్రేక్షకులను పలకరించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే గతకాలపు ఘట్టాలకు ఆమె పాత్ర ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గతంలో బాలకృష్ణతో కలిసి విద్యా బాలన్ ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇక కొరటాల శివ సినిమాల్లో కథతో పాటు నేపథ్యం, అక్కడి ప్రజల జీవన విధానానికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసారి కుటుంబ అనుబంధాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. విభిన్నమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొరటాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దేవర తర్వాత ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!