

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. స్టార్ హీరో–స్టార్ డైరెక్టర్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ మరియు శక్తివంతమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో విశేష ఆసక్తి కనిపిస్తోంది.
మరోవైపు, బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే కొరటాల శివతో రూపొందనున్న కొత్త చిత్రాన్ని సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ రెండు చిత్రాలు తక్కువ వ్యవధిలో విడుదలైతే బాలయ్య అభిమానులకు డబుల్ ట్రీట్ లభించినట్టే. విడుదల తేదీలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!