

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 209 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను తుది ఆమోదం కోసం పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపినట్లు సమాచారం. అయితే ఈ జాబితాపై కేంద్ర నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ఈసారి 300కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడంపై పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల ప్రచార వ్యూహాలపైనా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!