9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!

Writer: Shivani K 04:34 PM, 9 నవంబర్, 2026
మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అడ్వకేట్ బి. గోపాలకృష్ణన్ ఇంటికి ఆయన వెళ్లడం ఈ వివాదానికి కారణమైంది. గోపాలకృష్ణన్ కుమార్తె వివాహానికి హాజరుకాలేకపోయిన మమ్ముట్టి.. నూతన వధూవరులను అభినందించేందుకు తాజాగా ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీపీఎం మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు నెటిజన్లు మమ్ముట్టిపై విమర్శలు గుప్పించారు. కాగా, గోపాలకృష్ణన్ కుమార్తె వివాహానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాదంపై అడ్వకేట్ బి. గోపాలకృష్ణన్ స్పందించారు. మమ్ముట్టిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నవారు నిజమైన సీపీఎం కార్యకర్తలు కాదని, ఆ పార్టీ మద్దతుదారులుగా నటిస్తున్నవారని ఆరోపించారు. అన్ని పార్టీల నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారని గుర్తుచేశారు. అప్పట్లో ఎలాంటి వివాదం లేదని, ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నవారికి సరైన గుర్తింపు కూడా లేదని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!

మరో మైలురాయిని దాటిన రామాయణ?

మరో మైలురాయిని దాటిన రామాయణ?

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?

సీన్ తో సూర్య సంచలనం?

సీన్ తో సూర్య సంచలనం?

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?

ట్యాగ్లు
మమ్ముట్టిబి గోపాలకృష్ణన్కేరళ రాజకీయాలుబీజేపీసీపీఎంమమ్ముట్టి వివాదంసోషల్ మీడియా విమర్శలుమలయాళ సినిమాపినరయి విజయన్వి డి సతీశన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ
రాజకీయాలు

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!
గాసిప్స్

మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!

ఏపీలో వరుస అగ్నిప్రమాదాలు.. ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
జనరల్

ఏపీలో వరుస అగ్నిప్రమాదాలు.. ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష!

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!
రాజకీయాలు

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం

పాత పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పాత పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!
గాసిప్స్

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన ఆహారంలో వంకాయకు ప్రత్యేక స్థానం!
ఆరోగ్యం

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన ఆహారంలో వంకాయకు ప్రత్యేక స్థానం!

పోలీసు అధికారి మృతిపై ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం
జనరల్

పోలీసు అధికారి మృతిపై ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు
జనరల్

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!