

ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన కొన్ని పోస్టర్లకే దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. సినిమా విడుదల తేదీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, అవుట్‌పుట్‌కు సంబంధించిన తాజా సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటివరకు పూర్తైన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని చిత్ర పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చినా సంచలనం సృష్టించేలా అవుట్‌పుట్ ఉందన్న నమ్మకాన్ని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లలో కలిగించినట్లు సమాచారం. కథ, విజువల్స్, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!