

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ సీక్వెల్ ‘ఇండియన్ 3’ విడుదలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ చిత్రానికి ముందు వచ్చిన పార్ట్ ఆశించిన విజయాన్ని అందుకోకపోయినప్పటికీ, మేకర్స్ మూడో భాగాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలకు సమాధానంగా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని ప్రకటించడంతో సినిమాపై మళ్లీ కొంత ఆసక్తి పెరిగింది.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ‘ఇండియన్ 3’ విడుదలయ్యే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విడుదల ప్రణాళికకు కమల్ హాసన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కోలీవుడ్ వర్గాల సమాచారం. రెమ్యునరేషన్‌తో పాటు మరికొన్ని పెండింగ్ అంశాలపై చర్చలు కూడా పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!