

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న తదుపరి భారీ చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని మేకర్స్ ఇటీవల స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై ఆయన దృష్టి పెట్టనున్నారని సమాచారం. ఈలోగా ‘గాడ్ ఆఫ్ వార్’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండగా, హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే షూటింగ్ ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!