
షోస్

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు తిరిగి తెరుచుకోనుంది. ఈ నెల 17వ తేదీ ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు పూర్తయిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ట్రెక్కింగ్ మార్గంలో పలుచోట్ల స్టెయిన్లెస్ స్టీల్ సీటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణంలో అలసిపోయిన వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. అలాగే, యాత్ర సమయంలో ప్రమాదవశాత్తు మరణించే భక్తులకు రూ.2 లక్షల జీవిత బీమా అందించనున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!