

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’పై ఇప్పటికే అపారమైన అంచనాలు నెలకొన్నాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత హీరోగా ఆయన నుంచి విడుదలవుతున్న ఆఖరి సినిమా కావడంతో అభిమానులు దీనిని ప్రత్యేకంగా చూస్తున్నారు. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విడుదలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వాయిదా పడిన విడుదల తేదీతో పోలిస్తే ఈసారి మరింత విస్తృత స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా 7000 నుంచి 8000 స్క్రీన్స్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 30 దేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఖ్య నిజమైతే విజయ్ కెరీర్‌లోనే కాకుండా కోలీవుడ్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విడుదలగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకోగా, ఇంత పెద్ద ఎత్తున విడుదల కావడంతో ఓపెనింగ్ కలెక్షన్లు కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!