

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో తన ప్రధాన భాగాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. రెండేళ్లకు పైగా ఈ చిత్రానికి అంకితమైన మహేశ్ బాబు తాజాగా తన ఇంట్రడక్షన్ ఎపిసోడ్ సహా కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. ఇప్పటికే డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తం షూటింగ్‌లో 90 శాతానికి పైగా పూర్తికాగా, మిగిలిన ప్యాచ్‌వర్క్‌ను త్వరలో పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో రాజమౌళి ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, పురాణ నేపథ్య అంశాలను కలిపిన భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!