
సినిమాలు

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. చిత్రీకరణ వేగంగా కొనసాగుతుండగా, అభిమానులు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' విడుదలైన రెండు వారాల తర్వాత థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. మంచి టాక్ వస్తే సంక్రాంతి వరకు సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలో పోస్టర్ రూపంలో వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!