
జనరల్

‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రంలోని ఇతర పాత్రలకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌కు జోడీగా అనంతిక సనిల్‌కుమార్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ప్రతినాయకుడి పాత్ర కోసం చైతూ జొన్నలగడ్డ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో కొంతకాలం ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం తిరిగి వేగం పుంజుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సజావుగా సాగుతున్నట్లు సమాచారం. మిగతా నటీనటుల వివరాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!