

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కింగ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘తూ మిల్ జాయే’ పాట తొలుత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సినిమాకు సంబంధించిన తెలుగు ప్రచార స్టాండీ ఒకటి సోషల్ మీడియాలో కనిపించడంతో ‘కింగ్’ తెలుగులోనూ విడుదల కానుందా? అనే చర్చ మొదలైంది. అయితే, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
థియేటర్లకు తెలుగు అక్షరాలతో కూడిన ప్రచార సామగ్రి చేరినట్లు వస్తున్న వార్తలు తెలుగు విడుదలపై అంచనాలను పెంచుతున్నాయి. గతంలో షారుఖ్ నటించిన ‘జవాన్’, ‘పఠాన్’ సినిమాలు తెలుగులోనూ విడుదల కాగా, ‘డంకీ’ మాత్రం తెలుగులో విడుదల కాలేదు. ‘కింగ్’లో సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరీనా కపూర్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!