

హాయిగా నిద్రపోవడం కూడా లక్షల రూపాయల బహుమతిని తెచ్చిపెడుతుందని నిరూపించింది ముంబయికి చెందిన జినియా ఛటర్జీ. ప్రముఖ పరుపుల తయారీ సంస్థ నిర్వహించిన ఐదో సీజన్ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్’ పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. నిద్రను క్రమశిక్షణతో కూడిన రోజువారీ అలవాటుగా మార్చుకుని ఈ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన జినియా.. రూ.9.6 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ ట్రిప్‌ను కూడా సొంతం చేసుకుంది.
ఈ పోటీకి దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. తుది పోరు కోసం పది మందిని ఎంపిక చేశారు. 60 రోజుల పాటు సాగిన ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు కేవలం నిద్రపోవడమే కాకుండా తమ నిద్ర సరళిని పర్యవేక్షించడం, నిద్ర నాణ్యతను ట్రాక్ చేయడం, ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం వంటి నిబంధనలను పాటించాల్సి వచ్చింది. అంతేకాకుండా లీడర్‌బోర్డులో ముందంజలో నిలిచేందుకు నిర్వాహకులు ఇచ్చిన వివిధ టాస్క్‌లను పూర్తి చేయాల్సి వచ్చింది. వీటన్నింటిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జినియా విజేతగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!