

దర్శకుడు పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టిన ఆయన ఇటీవల కళ్యాణ్ రామ్‌కు కొత్త కథ వినిపించినట్లు సమాచారం. కథ నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. తుది కథనం పూర్తైన తర్వాత మరోసారి చర్చించి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కలయికపై ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే పరశురామ్ దర్శకత్వంలోని కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశముందని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కథ, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముందని తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!