

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మణిరత్నం మరోసారి ఆసక్తికరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘రోజా’ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను అందించిన ఆయన, ‘థగ్ లైఫ్’ తర్వాత తెరకెక్కిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మణిరత్నం తనదైన శైలిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
సైలెంట్‌గా షూటింగ్ ప్రారంభించిన మణిరత్నం వేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 7న సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మనిషి జీవితంలో నలుపు, తెలుపు మాత్రమే కాకుండా ఎన్నో రంగులు ఉంటాయనే భావనతో రూపొందించిన గ్లింప్స్ ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, అన్విక్ ముఖోపాధ్యాయ్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!