

కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల సంస్థాగత బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా పీవీ మోహన్, మహారాష్ట్ర ఇన్‌చార్జ్‌గా సిరివెళ్ల ప్రసాద్, పంజాబ్ ఇన్‌చార్జ్‌గా సచిన్ పైలట్, అస్సాం ఇన్‌చార్జ్‌గా భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జ్‌గా సుఖ్‌దేవ్ భగత్ నియమితులయ్యారు. పంజాబ్ బాధ్యతల నుంచి భూపేష్ బఘేల్‌ను తప్పించి సచిన్ పైలట్‌కు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజస్థాన్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గతంలో కేంద్ర మంత్రిగా, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయనకు తాజాగా పంజాబ్ బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూపేష్ బఘేల్‌కు అస్సాం బాధ్యతలు ఇచ్చారు. కర్ణాటకకు చెందిన పీవీ మోహన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిరివెళ్ల ప్రసాద్, ఝార్ఖండ్‌కు చెందిన సుఖ్‌దేవ్ భగత్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలను బలోపేతం చేయడంతో పాటు, స్థానిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కొత్త నాయకత్వాన్ని రంగంలోకి దించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!