

‘జైలర్ 2’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ధర్మన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఎంటర్‌టైనర్‌లో రజినీకాంత్‌ను భిన్నమైన పాత్రలో చూపించేందుకు దర్శకుడు అశ్వత్ మారిముత్తు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో సిమ్రన్, రాశీ ఖన్నా, యోగి బాబు, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాను కొత్త తరహాలో తెరకెక్కించనున్నారని, వినోదానికి పెద్దపీట వేయనున్నారని ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్‌ను డాక్టర్ పాత్రలో, కామెడీ సన్నివేశాల్లో చూడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ కొత్త కలయికపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!