

ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఓం’ నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ‘అమరన్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తొలుత ‘ఓం’ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఈ రెండు చిత్రాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం ఉండదని దర్శకుడు తాజాగా స్పష్టం చేశారు. తొలి సినిమాలోనే కథ పూర్తవుతుందని వెల్లడించారు.
అలాగే ‘ఓం’ ద్విభాషా చిత్రం కాదని రాజ్‌కుమార్ పెరియసామి క్లారిటీ ఇచ్చారు. అయితే తమిళ, తెలుగు ప్రేక్షకులు తమ తమ భాషల్లో నేరుగా రూపొందించిన సినిమాను చూస్తున్న అనుభూతిని పొందుతారని తెలిపారు. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!