

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల నిర్వహించిన ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి మధ్య చోటుచేసుకున్న ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్ ఆమె పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించినట్లుగా కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ, ట్రోలింగ్ మొదలయ్యాయి. తనకంటే వయసులో చిన్నదైన హీరోయిన్ పాదాలకు దర్శకుడు నమస్కరించడంపై పలువురు నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ ఘటనపై తాజాగా త్రివిక్రమ్ స్పందిస్తూ అసలు విషయం వివరించారు. శ్రీనిధి శెట్టితో తనకు ఉన్న స్నేహం, సరదా చనువు కారణంగానే అలా చేసినట్లు తెలిపారు. తాను ఇప్పటివరకు పనిచేసిన హీరోయిన్లలో శ్రీనిధి తమ కుటుంబానికి ఎంతో దగ్గరైన వ్యక్తి అని, సెట్స్‌లో అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆత్మీయంగా కలిసిపోతుందని చెప్పారు. సన్నిహితుల మధ్య ఉండే సరదా ఆటపట్టింపుల్లో భాగంగానే ఆమె పాదాలకు నమస్కరిస్తున్నట్లు నటించానని, దాని వెనుక ఎలాంటి ప్రత్యేక ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ ఘటనపై జరుగుతున్న చర్చకు ఆయన వివరణ ఇచ్చినట్లయింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!