

హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రోసీ ఓక్తావియాపై 21-9, 21-6తో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రెండో సీడ్ సింధు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కేవలం 26 నిమిషాల్లోనే వరుస గేమ్‌లలో మ్యాచ్‌ను ముగించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.
మరోవైపు భారత షట్లర్ మాళవిక బన్సోద్‌కు నిరాశ ఎదురైంది. రెండో రౌండ్‌లో కెనడాకు చెందిన వెన్ యు జాంగ్ చేతిలో 11-21, 17-21తో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో మరో భారత ఆటగాడు కిరణ్ జార్జ్‌తో తలపడిన లక్ష్యసేన్ 21-15, 18-21, 21-12తో విజయం సాధించాడు. దీంతో హైలో ఓపెన్‌లో భారత షట్లర్లు తదుపరి రౌండ్లలో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!