
క్రీడలు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో ఓ భారీ సినిమా తెరకెక్కనుంది. రామ్ చరణ్ కెరీర్‌లో 17వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినిమా లాంచ్ సమయంలోనే హీరోయిన్ పేరును ప్రకటిస్తారని అభిమానులు భావించారు. అయితే చిత్రబృందం మాత్రం కథానాయిక వివరాలను వెల్లడించలేదు.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హీరోయిన్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ, ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. దీంతో మరో కొత్త హీరోయిన్ కోసం చిత్రబృందం అన్వేషణ మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!