
జనరల్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌తో చేయనున్న సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమాలో ఆయన చిన్న కామియోలో కనిపించబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్ ప్రత్యేకంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.
అయితే తాజాగా ఈ ప్రచారంపై మెగా కాంపౌండ్ వర్గాల నుంచి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ‘ఇరుముడి’ సినిమాలో ఎలాంటి కామియో చేయలేదని, ‘మల్లెపూల పల్లకి’ పాటలో కూడా ఆయన కనిపించరని సమాచారం. దీంతో ఇప్పటివరకు వైరల్ అయిన వార్తలకు తెరపడినట్లే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!