
జనరల్

మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న ఇరుముడితో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుని, భారీ వసూళ్లు సాధించినట్లు సమాచారం. సినిమా మొత్తం రూ.250 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇరుముడి విజయానంతరం రవితేజ తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఆయన ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి తులాభారం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. వివేక్ ఆత్రేయ శైలిలో ఈ సినిమా వినోదాత్మకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హసిత్ గోలి దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా చేయనున్నారు. ఇందులో శ్రీవిష్ణు కూడా నటించే అవకాశమున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!