

తమిళ సినిమా దగ్గర అగ్ర దర్శకులుగా శంకర్, ఏఆర్ మురుగదాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశాలను కలిపి సినిమాలు తెరకెక్కించడంలో ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ వీరి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ గతంలో ఉన్నంత ఫామ్‌లో లేకపోయినా, వీరి బ్రాండ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో శంకర్, మురుగదాస్ కలిసి ఓ సినిమా చేయనున్నారనే క్రేజీ టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మురుగదాస్ కథ అందిస్తే, శంకర్ దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉన్నప్పటికీ, ఇద్దరు అగ్ర దర్శకుల కాంబినేషన్‌పై వస్తున్న ఈ టాక్ మాత్రం సినీ అభిమానులను ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!