

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన కెరీర్లో 48వ సినిమాగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌పై ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రానికి గతంలో సూర్యతో పనిచేసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన కొన్ని వివరాలు ప్రచారంలోకి రావడంతో కోలీవుడ్‌లో చర్చ మొదలైంది.
వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సూర్య ఐదు రూపాయలకే వైద్యం చేసే డాక్టర్ పాత్రలో కనిపించనున్నారట. అంతేకాకుండా కార్పొరేట్ వైద్య రంగానికి సంబంధించిన అంశాలు, ఆ వ్యవస్థతో జరిగే సంఘర్షణ కథలో కీలకంగా ఉంటాయని ప్రచారం సాగుతోంది. దీంతో విజయ్ నటించిన ‘మెర్సల్’ (అదిరింది) సినిమా గుర్తుకు వస్తోందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో నటించగా, వాటిలో ఐదు రూపాయల డాక్టర్ పాత్ర కూడా ఒకటి. కార్పొరేట్ ఆస్పత్రులకు సంబంధించిన అంశాలను కూడా ఆ చిత్రంలో చూపించారు. అయితే ప్రస్తుతం సూర్య సినిమా గురించి వినిపిస్తున్నది ప్రచారంలో ఉన్న కథా సమాచారం మాత్రమే. నిజంగానే ఇదే కథాంశంతో సినిమా తెరకెక్కుతుందా? లేక దర్శకుడు మరో కొత్త కోణంలో ఈ అంశాన్ని చూపిస్తారా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!