
జనరల్

నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం స్వయంభు విడుదల తేదీపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న విడుదల చేసే దిశగా మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన పాత్ర కోసం నిఖిల్ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో ప్రత్యేక శిక్షణ తీసుకోగా, ఈ భారీ చారిత్రక చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!