
జనరల్

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్100’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల అఖిల్ నటించిన ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున, తన కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను జూలై 10, 2026 తర్వాత వెల్లడిస్తానని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.
తాజా ప్రచారం ప్రకారం, దాదాపు 28 ఏళ్ల తర్వాత టబు మళ్లీ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి ఆమె హీరోయిన్‌గా కాకుండా ప్రధాన ప్రతినాయకురాలిగా కనిపించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తండ్రి-కూతురు భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. అయితే టబు పాత్రకు సంబంధించిన వార్తలపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!