

భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొల్పుతున్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి ‘రామాయణ’, తెలుగులో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ రామాయణానికి సంబంధించిన అంశాలు ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. అయితే ‘వారణాసి’లో ఈ ఘట్టం కొంతసేపు మాత్రమే కనిపించనున్నప్పటికీ, దాని రూపకల్పనపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రాజమౌళి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎంపైర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి గతంలో వచ్చిన రామాయణ చిత్రాలు తనకు పూర్తిస్థాయి సంతృప్తిని ఇవ్వలేదని, ఆ ఇతిహాసానికి తగిన న్యాయం చేసినట్లు అనిపించలేదని పేర్కొన్నట్లు సమాచారం. తన ‘వారణాసి’లో మాత్రం రామాయణ వైభవాన్ని అత్యంత గొప్పగా ఆవిష్కరిస్తాననే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పరిమిత నిడివిలోనే జక్కన్న ఎలాంటి అద్భుతాన్ని చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!