

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ బిల్లులపై చర్చించి ఆమోదం పొందేందుకు డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులకు ఈ అంశంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు సిద్ధంగా ఉండాలని, తమ విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. సభలో విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలు, విమర్శలకు ధీటుగా సమాధానాలు ఇచ్చేందుకు సమాయత్తం కావాలని ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ బిల్లుల ఆమోదానికి 361 మంది సభ్యుల మద్దతు అవసరమని, ప్రస్తుతం ఎన్డీఏకు 320 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని సమాచారం. దీంతో అవసరమైన మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, ఆప్ వంటి పార్టీల ఎంపీల మద్దతు పొందేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల నాటికి బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!