

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ జి. లక్ష్మీ శా తెలిపారు. ఉదయం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 8.32 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ఐదు మండలాల్లోని 72 గ్రామ పంచాయతీలు, 814 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,11,318 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 8 గంటల సమయానికి 25,912 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
మండలాల వారీగా చూస్తే ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 17.38 శాతం పోలింగ్ నమోదైంది. మైలవరంలో 13.92 శాతం, జి. కొండూరులో 9.99 శాతం, విజయవాడ రూరల్‌లో 4.44 శాతం, రెడ్డిగూడెంలో 4.27 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అర్హులైన ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ లక్ష్మీ శా విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!