

మన పూర్వీకులు అందించిన సంప్రదాయ వంటకాల్లో ఇప్పపూల కుడుములు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. ఎండబెట్టిన ఇప్పపూలను బరకగా పొడి చేసి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లంతో కలిపి తీపి పూరణంగా తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఇప్పపూల పొడిని కడాయిలో వేసి, కొబ్బరి తురుము, తురిమిన బెల్లం, కొద్దిగా నీరు పోసి మధ్యస్థ మంటపై 5–6 నిమిషాలు ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మంట తగ్గించి మిశ్రమం ముద్దగా మారే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మరోసారి కడాయిలో నీరు మరిగించి, పటిక బెల్లం పొడి లేదా పంచదార వేసి, బియ్యం పిండిని కలిపి వెంటనే మంట ఆపాలి. మూతపెట్టి 10 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పిండిని మెత్తగా కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని చపాతీలా ఒత్తి మధ్యలో ఇప్పపూలు-కొబ్బరి పూరణ పెట్టి అంచులను గట్టిగా మూసేయాలి. ఇడ్లీ పాత్రలో నీరు పోసి, నెయ్యి రాసిన ప్లేట్లపై కుడుములు పెట్టి తక్కువ మంటపై సుమారు 20 నిమిషాలు ఆవిరితో ఉడికించాలి. ఇప్పపూలకు సంప్రదాయంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అయితే వీటిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!