

కాఫీ తాగడం వల్ల కేవలం అలసట తగ్గి ఉత్సాహం రావడమే కాకుండా జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కోపెన్‌హాగన్ యూనివర్సిటీ పరిశోధకులు 61 మందిపై తొమ్మిది రోజుల పాటు అధ్యయనం చేశారు. ప్రత్యేక క్యాప్సూల్స్ సాయంతో జీర్ణవ్యవస్థలోని ఉష్ణోగ్రత, పీహెచ్ స్థాయి, ఒత్తిడి, పేగుల కదలికలను పరిశీలించారు. కాఫీలో ఉండే ఫినాలిక్ యాసిడ్స్, ఫైబర్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.
మూత్రంలో కెఫిన్ ఉప ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నవారిలో పెద్దప్రేగు సంకోచాలు మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనంలో గమనించారు. ఈ మార్పులు పేగుల కదలికలకు తోడ్పడి మలబద్ధకం తగ్గేందుకు సహాయపడవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ప్రభావాలకు కాఫీ ఒక్కటే కారణమని ఇప్పుడే నిర్ధారించలేమని, మరిన్ని పరిశోధనలు అవసరమని స్పష్టం చేస్తున్నారు. మలబద్ధకం తగ్గించుకోవడానికి కాఫీపైనే ఆధారపడకుండా తగినంత నీరు తాగడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం.
గమనిక: ఈ కథనంలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మలబద్ధకం సమస్య ఎక్కువకాలం కొనసాగితే అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!