

అండర్-19 ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నీలో యువ భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. నేడు ఒమన్‌లోని అల్ అమీరట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ 1, 3, 4 చానళ్లతో పాటు సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. లక్ష్య రాయ్‌చందాని నాయకత్వంలోని భారత జట్టు గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 12 టోర్నీల్లో భారత్ ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది.
సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరగా, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన పాకిస్తాన్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ టోర్నీలో 101 సగటుతో 303 పరుగులు చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్ భారత జట్టుకు కీలకంగా మారాడు. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని, వీకే వినీత్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ బ్యాటింగ్‌లో రాణిస్తారని జట్టు ఆశిస్తోంది. బౌలింగ్‌లో ఇషాన్ సూద్ కీలక పాత్ర పోషించనున్నాడు. మరోవైపు, ఫర్హాన్ యూసుఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!