

అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అన్నారు. కేవలం ఆర్థిక వృద్ధి, పరిశ్రమల విస్తరణ ఆధారంగా రాష్ట్ర ప్రగతిని అంచనా వేయకూడదని పేర్కొన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందడం, వృద్ధులు గౌరవప్రదమైన జీవనం సాగించడం, బలహీన వర్గాలకు సమాన అవకాశాలు లభించడం వంటి అంశాలే సమగ్రాభివృద్ధికి ముఖ్యమైన కొలమానాలని వివరించారు.
హైటెక్స్‌లో జరుగుతున్న భారత్ సమిట్-2026లో “విద్య, సంక్షేమం, సాధికారత ద్వారా సామాజిక న్యాయం” అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో మంత్రి మాట్లాడారు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో 105 నియోజకవర్గాల్లో సుమారు రూ.21 వేల కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల ద్వారా 2.70 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించనున్నట్లు చెప్పారు. ప్యానెల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. బాలల సంక్షేమం, అట్టడుగు వర్గాల విద్యపై మంత్రి ఇచ్చిన వివరణలను సామాజిక కార్యకర్త శాంతా సిన్హా అభినందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!