

చాలామంది టూత్ బ్రష్ కొనుగోలు సమయంలో ధర, బ్రాండ్‌కే ప్రాధాన్యం ఇస్తారు. కానీ బ్రిసిల్స్ గట్టితనం కూడా దంత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మార్కెట్‌లో ఎక్స్‌ట్రా సాఫ్ట్, సాఫ్ట్, మీడియం, హార్డ్ అనే నాలుగు రకాల బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం, దంతాల సెన్సిటివిటీ ఉన్నవారు లేదా దంత చికిత్సలు చేయించుకున్నవారికి ఎక్స్‌ట్రా సాఫ్ట్ బ్రష్‌లు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లు ఉన్నవారికి సాఫ్ట్ బ్రష్‌ను దంతవైద్యులు ఎక్కువగా సూచిస్తారు.
మీడియం బ్రష్‌ను పళ్లపై మరకలు ఎక్కువగా ఉన్నవారు ఉపయోగిస్తారు. అయితే అధిక ఒత్తిడితో బ్రష్ చేస్తే చిగుళ్లకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. హార్డ్ బ్రష్‌లు సాధారణ వినియోగానికి తగవని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఎక్కువగా వాడితే ఎనామెల్ దెబ్బతినడం, చిగుళ్లు వెనక్కి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లలు, సెన్సిటివిటీ ఉన్నవారు హార్డ్ బ్రష్‌లను తప్పుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా బ్రిసిల్స్ పాడైన వెంటనే బ్రష్ మార్చుకోవడం, రోజుకు రెండుసార్లు సరైన పద్ధతిలో బ్రష్ చేయడం దంత ఆరోగ్యానికి మంచిది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!