

కఠినమైన డైటింగ్, కఠోర వ్యాయామాలు చేసినా బరువు తగ్గలేక ఇబ్బందులు పడుతున్న వారికి శుభవార్త. 2026 జూన్ 11న బ్రిటన్ ప్రభుత్వం నొప్పి లేని వెయిట్ లాస్ టాబ్లెట్‌కు అధికారిక అనుమతి ఇచ్చింది. నోవో నార్డిస్క్ అభివృద్ధి చేసిన ఈ మాత్రకు అమెరికాలో ముందే ఆమోదం లభించగా, ఇప్పుడు యూకేలో కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో సెమాగ్లుటైడ్ అనే క్రియాశీల పదార్థం ఉండడం విశేషం. ఇదే పదార్థం మధుమేహానికి వాడే ఓజెంపిక్ ఇంజెక్షన్లో కూడా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా వెయిట్ లాస్ మందుల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. లిల్లీ సంస్థ కూడా ‘ఫౌండాయో’ అనే నోటి ద్వారా తీసుకునే మందును మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2030 నాటికి ఈ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మేరీ స్ప్రెక్లీ ప్రకారం, కొంతమంది రోగులకు ఈ మాత్రలు ఇంజెక్షన్ల కంటే మెరుగ్గా పనిచేయవచ్చు. ఈ మందును ఖాళీ కడుపుతో భోజనం ముందు 30 నిమిషాలకైనా తీసుకోవాలని సూచించారు. అయితే, వైద్యుల సలహా తప్పనిసరి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!