

పాలు మంచి పోషకాహారం అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ సరిపడవు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాలేయ సమస్యలు లేదా కామెర్లు ఉన్నవారు పాలను దూరంగా ఉంచాలి, ఎందుకంటే పాలలోని కొవ్వు, ప్రోటీన్లు కాలేయంపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి కూడా పూర్తి కొవ్వు ఉన్న పాలు ప్రమాదకరం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుల సలహాతో తక్కువ కొవ్వు ఉన్న పాలను మాత్రమే పరిమితంగా తీసుకోవాలి.
లాక్టోజ్ ఇన్టోలరెన్స్ ఉన్నవారికి పాలు తాగిన వెంటనే కడుపునొప్పి, గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అలాగే అసిడిటీ, మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఉన్నవారికి పాలు సరిగా జీర్ణం కావు, ముఖ్యంగా రాత్రివేళల్లో తాగితే ఇబ్బందులు పెరుగుతాయి. అధికంగా పాలు తాగడం వల్ల మొటిమలు, జిడ్డు చర్మం సమస్యలు కూడా పెరగవచ్చు. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు పాలు తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!