

ఎప్పుడూ ఒకే విధమైన కూరలు చేయడం బోర్‌గా అనిపిస్తే ఈసారి శనగపిండి కూరను ట్రై చేయండి. ఇది పూరి, చపాతీ, రోటీలతో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేకపోయినా కేవలం శనగపిండి, ఉల్లిపాయలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా శనగపిండి నీటితో కలిపి ఉండలు లేకుండా మిశ్రమం చేసుకోవాలి.
పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు కలపాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి చివరగా శనగపిండి మిశ్రమం వేసి సన్నని మంటపై చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!