

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ‘రామాయణం’ను ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించేందుకు రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ప్రథమ సంకల్పం’ కార్యక్రమం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తుండగా, ఆయన సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా, శోభన కైకేయిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, డీఎన్‌ఈజీ మరియు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అత్యాధునిక దృశ్య ప్రభావాలను అందిస్తున్నాయి. జూలై 24న అధికారిక ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుండగా, ‘రామాయణం: తొలి భాగం’ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!